Header Banner

పెన్షనర్లకు గుడ్‌న్యూస్..! భారీగా పెరుగుతున్న పెన్షన్‌.. ఎంత అంటే!

  Tue Apr 29, 2025 08:28        Others

చాలా సంవత్సరాలుగా భారతదేశంలోని కార్మిక సంఘాలు, పెన్షనర్ గ్రూపులు EPS-95గా పేర్కొనే ఎంప్లాయీస్‌ పెన్షన్ స్కీమ్‌ (EPS) కింద పెన్షన్ అమౌంట్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తున్నాయి. జీవన వ్యయాలు పెరుగుతున్నప్పటికీ, ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2014లో రూ.1,000గా నిర్ణయించిన మినిమం పెన్షన్ అమౌంట్‌ని అప్‌డేట్‌ చేయలేదు. ఈ డిమాండ్లను పరిష్కరించడానికి పార్లమెంటరీ కమిటీ ఈ స్కీమ్‌ థర్డ్‌ పార్టీ రివ్యూకి పిలుపునిచ్చింది. దీంతో పెన్షన్‌ అమౌంట్‌ పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
EPS-95 అంటే ఏంటి?1995లో ప్రారంభించిన EPS-95 అనేది పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే పథకం. ఇది కనీసం 10 సంవత్సరాలు పెన్షన్ ప్లాన్‌కి కాంట్రిబ్యూట్‌ చేసే EPFO ​​సభ్యులకు ప్రయోజనాలు అందిస్తుంది. అయితే పదేళ్ల క్రితం నిర్ణయించిన రూ. 1,000 మినిమం పెన్షన్, ఇప్పుడు ఏమాత్రం సరిపోదు.
పెన్షన్‌ పెంపు కోసం నిరీక్షణ:ఈ నేపథ్యంలో దీనిపై త్వరగా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ, కేంద్ర కార్మిక శాఖను కోరింది. ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ (EPS) థర్డ్‌ పార్టీ ఎవాల్యువేషన్‌ ఇండిపెండెంట్‌ ఎక్స్‌పర్ట్స్‌ నిర్వహించాలని కమిటీ పిలుపునిచ్చింది. ఈ రివ్యూ పథకాన్ని అంచనా వేసి, ఇంప్రూవ్‌మెంట్స్‌ని సూచించే లక్ష్యంతో జరుగుతుంది. 30 సంవత్సరాల్లో ఇటువంటి రివ్యూ జరగడం ఇదే మొదటిసారి. 2025 చివరికి పనులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
కమిటీ రిపోర్ట్‌ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తుంది. ‘2014 నుంచి జీవన వ్యయం అనేక రెట్లు పెరిగింది, కానీ పెన్షన్ మొత్తం అలాగే ఉంది’ అని తెలిపింది. ఈ విషయాన్ని ‘అత్యవసర భావనతో (Sense of urgency)’ పరిగణించి, కనీస పెన్షన్ పెంచడాన్ని పరిగణించాలని ప్యానెల్ మంత్రిత్వ శాఖను కోరింది.


ఇది కూడా చదవండి: ఏపీ రాజ్యసభకు కూటమి అభ్యర్థి ఖరారు..! బీజేపీ నుంచి ఆయన ఎంట్రీ!

గత ప్రయత్నాలు, డిమాండ్లు:2020లో కనీస పెన్షన్‌ను రూ.2,000కి పెంచాలని ప్రతిపాదించినట్లు కార్మిక శాఖ కమిటీకి తెలిపింది. కానీ ఆర్థిక శాఖ దానిని తిరస్కరించింది. 2024-25 బడ్జెట్‌కు ముందు ఈ ఆలోచన మళ్లీ చర్చకు వచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, రిటైర్డ్ EPS-95 ఉద్యోగులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి పెన్షన్‌తో పాటు, డియర్‌నెస్ అలవెన్స్ (DA)ను పెంచాలని కోరారు. వారి డిమాండ్లను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడానికి పదవీ విరమణ చేసిన వారికి సహాయం చేయడానికి ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగి సంఘాలు చాలా కాలంగా రూ.7,500 పెన్షన్‌ను డిమాండ్ చేస్తున్నాయి.
ముందుకు పడిన అడుగు:రిక్వెస్ట్‌ ఆఫ్‌ ప్రపోజల్ (RFP) ద్వారా థర్డ్‌ పార్టీ రివ్యూ కోసం కార్మిక మంత్రిత్వ శాఖ ప్రక్రియను ప్రారంభించింది, పని జరుగుతోంది. ఇంతకు ముందు ఎప్పుడూ అలాంటి సమీక్ష జరగలేదని కమిటీ గుర్తించింది. ఇది ఒక ముఖ్యమైన దశగా మారింది.
పెరుగుతున్న ఆశలు:థర్డ్‌ పార్టీ రివ్యూకి పిలుపు లక్షలాది మంది EPS-95 పెన్షనర్లలో ఆశ కలిగిస్తోంది. జీవన వ్యయాలు పెరుగుతున్నందున, పెన్షన్ మొత్తంలో పెరుగుదల భారీ ఉపశమనం అందిస్తుంది. 2025 చివరి నాటికి తీపి కబురు అందే అవకాశం ఉంది.



ఇది కూడా చదవండిమరో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #EPS95 #PensionHike #GoodNewsForPensioners #RetirementRelief #EPFO #MinimumPension